ధాన్యం సేకరణకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-30T04:05:49+05:30 IST

ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 624 రైతుభరోసా కేంద్రాలు, 119 పీఏసీఎస్‌లు, 63 వెలుగు కేంద్రాలు, 8 జీసీసీ డిపోలు, 5 రైతు సంఘాలు, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 2, ఏఎంసీలకు 19 కేంద్రాలు... ఇలా మొత్తం 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి



అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కలెక్టరేట్‌, అక్టోబరు 29: ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 624 రైతుభరోసా కేంద్రాలు, 119 పీఏసీఎస్‌లు, 63 వెలుగు కేంద్రాలు, 8 జీసీసీ డిపోలు, 5 రైతు సంఘాలు, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 2, ఏఎంసీలకు 19  కేంద్రాలు... ఇలా మొత్తం 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేంద్రాల వద్ద తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. గన్నీబ్యాగులు, వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నవంబరులో 20,327 మెట్రిక్‌ టన్నులు, డిసెంబరులో 1.56 లక్షలు, జనవరిలో 3.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తులు వచ్చే అవకాశమున్న దృష్ట్యా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మొత్తం 6 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తయ్యే అవకాశముందని తెలిపారు. జేసీ కిశోర్‌కుమార్‌ మాట్లాతూ జిల్లాలో ఈ-క్రాప్‌ 98 శాతం, ఈకేవైసీ 71 శాతం పూర్తయ్యిందన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ రామారావు, డీడీ నందు, ఆనంద్‌, జిల్లా సహకార అధికారి అప్పలనాయుడు పాల్గొన్నారు. 

శిక్షణ శిబిరాలు పెంచండి

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ శిబిరాలు పెంచాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. మార్కెట్‌లో త్వరితగతిన ఉపాధి లభించే కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి, భోజనం కల్పించాలని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. పూలబొకేల తయారీ, సోలార్‌ ప్యానళ్ల మరమ్మతులు, ఆటో మొబైల్స్‌ రిపేర్స్‌, ప్లంబింగ్‌, సిరామిక్‌ ఉత్పత్తుల తయారీ వంటి వాటిపై శిక్షణనివాల్వని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు, సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం గ్రామ తరంగ్‌ సంస్ధ ఎమ్‌డీ బాబూ శంకర్‌, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్‌ సత్య శ్రీనివాస్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ నీలకంఠ ప్రదానో, నెహ్రూ యువ కేంద్రం అధికారి విక్రమాదిత్య పాల్గొన్నారు.




Updated Date - 2021-10-30T04:05:49+05:30 IST