తాగునీటి సరఫరా ఏదీ..?

ABN , First Publish Date - 2021-01-13T05:15:41+05:30 IST

పట్టణ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని, చెత్త చెదారాల నుంచి పట్టణాన్ని కాపాడాలని, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు ఆధ్వర్యంలో ప్రజలు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో బైఠాయించారు.

తాగునీటి సరఫరా ఏదీ..?

పార్వతీపురంటౌన్‌, జనవరి 12: పట్టణ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని, చెత్త చెదారాల నుంచి పట్టణాన్ని కాపాడాలని, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు ఆధ్వర్యంలో ప్రజలు మంగళవారం  మున్సిపల్‌ కార్యాలయంలో బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా కుళాయిల నుంచి తాగునీరు సరఫరా కాకపోవడంతో పట్టణం లోని 30 వార్డుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారినా  ప్రజారోగ్యశా ఖాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత 3 సంవత్సరాలుగా రోజూ తాగునీటి సరఫరా నిలుపుదల చేయడంవల్ల పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు పెరి గాయని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగలోనైనా సక్రమంగా తాగునీటి సరఫరా చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. దీనికి కమిషనర్‌ కనకమహాలక్ష్మి స్పందిస్తూ మీ కోరిక మేరకు తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.


Updated Date - 2021-01-13T05:15:41+05:30 IST