టైరుబండి ఢీకొని వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2021-10-28T05:39:42+05:30 IST
టైరుబండి ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

తెర్లాం: టైరుబండి ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ బి.సురేంద్ర నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిగాం గ్రామానికి చెందిన కోరాడ చిన్నోడు (72) బుధవారం తన గొర్రెలను మేత కోసమని గ్రామ సమీపంలోని రహదారిపై తీసుకువెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా టైరుబండి వస్తోంది. అయితే టైరుబండికి ఉన్న ఎద్దులు అకస్మాత్తుగా పరుగుపెట్టాయి. ఎదురుగా వెళ్తున్న చిన్నోడు ఆ బండిని ఆపే ప్రయత్నం చేశాడు. ఎద్దుల వేగానికి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు బాడంగి సీహెచ్‌సీకి తరలిస్తుండగా, మార్గ మధ్యంలో మృతిచెందాడు. సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.