తమ్ముడిపై అన్న దాడి
ABN , First Publish Date - 2021-07-24T05:52:53+05:30 IST
తమ్ముడిపై అన్న దాడి చేసిన సంఘటన సవరవల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

భోగాపురం, జూలై 23: తమ్ముడిపై అన్న దాడి చేసిన సంఘటన సవరవల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సవరవల్లి గ్రామానికి చెందిన నిద్రబంగి మహాలక్ష్మి, అప్పన్న ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ ఆస్తి తగాదాలతో నిరంతరం తగాదాలు పడుతూనే ఉండేవారు. ఈక్రమంలో గురువారం రాత్రి కూడా వీరిద్దరు మధ్య మాటామాటా పెరగడంతో అన్నయ్య మహాలక్ష్మి.. తమ్ముడు అప్పన్నపై కత్తితో దాడి చేశాడు. దీం తో అప్పన్న బుజంపై, తలపై గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప త్రికి తరలించారు. అప్పన్న భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యా యత్నం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు.