అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2021-01-13T05:17:59+05:30 IST

సంక్రాంతి పండగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్‌ఐ వై.సింహాచలం, ఏఎస్‌ఐ పి.రాంబా బు తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

గరుగుబిల్లి, జనవరి 12: సంక్రాంతి పండగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్‌ఐ వై.సింహాచలం, ఏఎస్‌ఐ పి.రాంబా బు తెలిపారు. మంగళవారం వీరిరువురు విలేఖరులతో మాట్లాడుతూ పండగను సంప్రదా యబద్ధంగా నిర్వహిం చుకోవాలన్నారు. కోడి, గొర్రె పందాలతో పాటు జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిం చరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవన్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడప రాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే 91211 09469 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

Updated Date - 2021-01-13T05:17:59+05:30 IST