నాడు-నేడు పనుల్లో బాధ్యతగా వ్యవహరించండి

ABN , First Publish Date - 2021-09-03T05:25:52+05:30 IST

: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు-నేడు పనుల విషయంలో అధికారులు బాధ్యతగా వ్యవహ రించాలని, అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని జేసీ మహేష్‌కుమార్‌ సూచించారు.

నాడు-నేడు పనుల్లో బాధ్యతగా వ్యవహరించండి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జేసీ మహేష్‌కుమార్‌

  అధికారులకు జేసీ మహేష్‌కుమార్‌ సూచన

విజయనగరం (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు-నేడు పనుల విషయంలో అధికారులు బాధ్యతగా వ్యవహ రించాలని, అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని జేసీ మహేష్‌కుమార్‌ సూచించారు. నాడు-నేడు రెండో దశ పనులపై ఇంజినీరింగు అధికారులు, మండల రిసోర్సు పర్సన్‌లకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో గురువారం ఒక్కరోజు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి అవసర మైన పనులనే గుర్తించాలని, ప్రభుత్వ  నిధులు సద్వినియోగమయ్యేలా చూడాలని తెలిపారు.  తొలి దశలో గుర్తించిన లోపాలు రెండో దశలో తలెత్తకూడదన్నారు.  క్షేత్ర స్థాయిలో పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని సూచించారు. మండల రిసోర్సు పర్సన్‌లు, ఇంజినీరింగ్‌ విభాగ అధికారులు సమన్వయంతో వ్యవహ రించి రెండో దశ నాడు-నేడు పనుల్లో ఆశాజనకమైన ఫలితాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్‌ ఏపీసీ కీర్తి, ఈఈ రవిశేఖర్‌, ఏపీడబ్ల్యూ ఐబీసీ ఈఈ శ్యామ్యుల్‌ తదితరులు పాల్గొన్నారు.


  

Updated Date - 2021-09-03T05:25:52+05:30 IST