నూతన ఆలోచనలతో ఉజ్వల భవిత

ABN , First Publish Date - 2021-12-20T05:27:45+05:30 IST

యువత ఉజ్వల భవిష్యత్తు కోసం నూతన ఆలోచనలతో ముందుకు సాగాని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి అన్నారు.

నూతన ఆలోచనలతో ఉజ్వల భవిత

 కలెక్టర్‌ సూర్యకుమారి

 పూసపాటిరేగ (భోగాపురం), డిసెంబరు 19: యువత ఉజ్వల భవిష్యత్తు కోసం నూతన ఆలోచనలతో ముందుకు సాగాని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి అన్నారు. పూసపాటిరేగ మండల కేంద్రంలోని పాలిటెక్నికల్‌ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ దిశగా విద్యను అభ్యసిస్తూ అనుకున్నది సాధించాలన్నారు. జాబ్‌మేళాలో 22 పరిశ్రమలకు చెందిన వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడ్డు కొం డ అప్పలనాయుడు, జేసీ వెంకటరావు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ శ్రీనివా సరా వు, వైసీపీ మండల అధ్యక్షుడు పి.అప్పలనాయుడు, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T05:27:45+05:30 IST