19న జెడ్పీ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2021-12-15T06:20:49+05:30 IST

జిల్లా పరిషత్‌ సర్వసభ్య తొలి సమావేశం ఈ నెల 19న జరగనున్నది.

19న జెడ్పీ సర్వసభ్య సమావేశం

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ సర్వసభ్య తొలి సమావేశం ఈ నెల 19న జరగనున్నది. సమావేశంలో తొలుత ఏడు స్థాయీ సంఘాల నియామకం జరుగుతుంది. అంతకుమించి జిల్లాలో సమస్యలకు సంబంధించిన ఎటువంటి అజెండా రూపొందించలేదు. 


మరో 19 కరోనా కేసులు

విశాఖపట్నం, డిసెంబరు 14: కొత్తగా 19 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,59,188కు చేరింది. ఇందులో 1,57,887 మంది కోలుకోగా, మరో 196 మంది చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2021-12-15T06:20:49+05:30 IST