వైఎస్సార్ పాలన స్వర్ణయుగం
ABN , First Publish Date - 2021-09-03T06:29:50+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మండ లంలో గ్రామ గ్రామాన గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్‌వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వర్ధంతి సభల్లో ఎమ్మెల్యే కన్నబాబురాజు
ఎలమంచిలి/అచ్యుతాపురం రూరల్/ మునగపాక/ రాంబిల్లి, సెప్టెంబరు 2 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మండ లంలో గ్రామ గ్రామాన గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్‌వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ పాలన స్వర్ణయుగమన్నారు. వైసీపీ నాయకులు ఎర్రయ్య దొర, గోవింద్, మునిసిపల్ వైస్ చైర్మన్లు నాగేశ్వరరావు, గుప్తా, నాయకులు ఆడారి శ్రీధర్, రాజాన శేషు, ఉప్పులూరి కిరణ్‌కుమార్, త్రినాథ్, రాజు, శివ, దాశరి కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే, అచ్యుతాపురంలో ఎమ్మెల్యే కన్నబాబురాజు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. నాయకులు సుకుమారవర్మ, మారిశెట్టి సూర్యనారాయణ, కోన బుజ్జి, దేశంశెట్టి శంకరరావు, డి.ఎస్.ఎన్.రాజు, గండిబోయిన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఎం.జగన్నాథపురం, ఉప్పవరం, యర్రవరం తదితర గ్రామాల్లో వైసీపీ శ్రేణులు అంజలి ఘటించారు. ఇదిలావుంటే, మునగపాకలో వైఎస్సార్ వర్ధంతిని ఎమ్మెల్యే కన్నబాబురాజు వర్గం, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ వర్గం వేర్వేరుగా నిర్వహించారు. ఇక్కడి నందీశ్వర ప్రాంగణం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ వేర్వేరుగా తమ అనుచరులతో వచ్చి పూలదండలు వేసి నివాళులర్పించారు. రాంబిల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఆయన కుమారుడు సుకుమార్‌వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు జి.శ్రీనుబాబు, డీఎస్‌ఎన్ రాజు, ఉపులూరి కిరణ్‌కుమార్, వర్మ పాల్గొన్నారు.