నిరుపేదల గుండెచప్పుడు వైఎస్‌

ABN , First Publish Date - 2021-09-03T05:25:44+05:30 IST

నిరుపేదల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని, పేదల గుండె చప్పుడు వైఎస్‌ అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

నిరుపేదల గుండెచప్పుడు వైఎస్‌
భీమిలిలో వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం, సెప్టెంబరు 2: నిరుపేదల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని, పేదల గుండె చప్పుడు వైఎస్‌ అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం వైఎస్‌ వర్ధంతి సందర్భంగా భీమిలిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో అవంతి-వైఎస్సార్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నబజారులో వైసీపీ మూడో వార్డు నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ముత్తంశెట్టి ప్రారంభించారు. తొలుత ఇక్కడి కూడలిలో ఉన్న వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంట్‌, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ వంటి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అక్కరమాని రామునాయుడు, సరళారాణి, అల్లిపిల్లి నరసింగరావు, దౌలపల్లి ఏడుకొండలరావు, కొప్పల ప్రభావతి, దాట్ల పెదబాబు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు గిడుతూరి శ్రీనివాసరావు సమకూర్చిన బియ్యం బస్తాలను ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరులకు మంత్రి ముత్తంశెట్టి,  జీవీఎంసీ కోఆప్షన్‌ సభ్యురాలు కె.ప్రభావతి పంపిణీ చేశారు.  

ఆనందపురం: దివంగత వైఎస్‌ ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. గంభీరం పంచాయతీ హైవేకు ఆనుకుని ఉన్న కల్లివానిపాలెం కరెంట్‌ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తండ్రి వైఎస్‌ను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్‌ ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాదరణ పొందుతున్నారన్నారు. అనంతరం నాయకుడు ఉప్పాడ సూరిబాబు సమకూర్చిన దుస్తులను వృద్ధులు, పేదలకు పంపిణీ చేశారు. వేములవలస కూడలిలో వైసీపీ మండల అధ్యక్షుడు బంక సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కాకర్లపూడి వరహాలరాజు, కోరాడ వెంకటరావు, మజ్జి వెంకటరావు, చందక సూరిబాబు, కోరాడ ముసలినాయడు, తదితరులు పాల్గొన్నారు. అలాగే వెల్లంకిలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రమణ ఆధ్వర్యంలో వైఎస్‌ వర్ధంతిని నిర్వహించారు. 

కొమ్మాది: పేద ప్రజల గుండెచప్పుడు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం, బోరవానిపాలెం వద్దనున్న రాజశేఖరరెడ్డి విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బోరవానిపాలెంలో మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతురావు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రియాంక, వైసీపీ నాయకులు పోతిన ఎల్లాజీ, పోతిన శ్రీనివాస్‌, హనుమంతురావు, బగాది లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-03T05:25:44+05:30 IST