ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-27T05:29:26+05:30 IST

ప్రేమించిన యువతితో వివాహానికి పెద్దలు అభ్యంతరం తెపడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
త్రినాథ్‌ (ఫైల్‌ ఫొటో)

సింహాచలం, నవంబరు 26:  ప్రేమించిన యువతితో వివాహానికి పెద్దలు అభ్యంతరం తెపడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రేటర్‌  98వ వార్డు సంతోషిమాత ఆలయవీధిలో తల్లి మంగలక్ష్మితో కలసి ఉంటున్న తంగేటి త్రినాథ్‌ (19) ప్రైవేటుగా ఎలక్ట్రికల్‌ పనులు చేస్తుంటాడు. ఇతడికి సింహాచలం ప్రాంతానికి చెందిన బాలికతో పరిచయమై, ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె మైనర్‌ కావడంతో పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పారు. ఇది తట్టుకోలేని త్రినాథ్‌ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం తల్లి కూలి పనులకు వెళ్లిపోగా, పక్కింటివారు త్రినాథ్‌ను పిలిచినప్పటికీ స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతడి తల్లికి, పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లి మంగలక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ ఆర్‌.అప్పలకొండ మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-11-27T05:29:26+05:30 IST