వైసీపీ వైఫల్యాలే గెలిపిస్తాయి..

ABN , First Publish Date - 2021-02-08T06:34:10+05:30 IST

అధికార పార్టీ రెండేళ్ల పాలనా వైఫల్యమే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులను గెలిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

వైసీపీ వైఫల్యాలే గెలిపిస్తాయి..
టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరిమాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి


చింతపల్లి, ఫిబ్రవరి 7: అధికార పార్టీ రెండేళ్ల పాలనా వైఫల్యమే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులను  గెలిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కార్యకర్తల ఏకాభిప్రాయంతో చింతపల్లి మేజర్‌ పంచాయతీ అభ్యర్థిగా రీమల ఆనంద్‌ని బరిలోకి దించుతున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. రెండేళ్ల పదవికాలంలో ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిన దాఖలాలు లేవన్నారు. గిరిజన ప్రాంతంలోనూ వైసీపీపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంటారన్నారు. కార్యకర్తలు ఐక్యతగా పని చేయాలని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, సీనియర్‌ ఉపాధ్యాయులు గోవింద్‌, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మణరావు,  సీనియర్‌ నాయకులు సేవా ఈశ్వరమ్మ, చైతన్య, అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T06:34:10+05:30 IST