పథకం ప్రకారమే టీడీపీ కార్యాలయాలపై దాడులు

ABN , First Publish Date - 2021-10-20T06:32:28+05:30 IST

అధికార పార్టీ నేతలు ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారని టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు.

పథకం ప్రకారమే టీడీపీ కార్యాలయాలపై దాడులు
విలేకరులతో మాట్లాడుతున్న తాతయ్యబాబు

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడాన్ని తట్టుకోలేకనే దుశ్చర్యలు

చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ తాతయ్యబాబు ధ్వజం


బుచ్చెయ్యపేట, అక్టోబరు 19: అధికార పార్టీ నేతలు ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారని టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. ఆయన మంగళవారం రాత్రి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ శ్రేణులు నిలదీయడాన్ని తట్టుకోలేని వైసీపీ గుండాలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నమా? లేక నియంత పాలనలో ఉన్నామా? అన్నది అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు ఇంతలా అరాచకాలకు పాల్పడుతుంటే, పోలీసు శాఖ చోద్యం చూస్తున్నదని విమర్శించారు. సమావేశంలో తెలుగు యువత ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:32:28+05:30 IST