ఆరడుగుల భౌతిక దూరం ఎక్కడ..?

ABN , First Publish Date - 2021-05-19T04:51:28+05:30 IST

అనకాపల్లి ఏపీ ఈపీడీసీఎల్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కేంద్రంలో వినియోగదారులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం లేదు.

ఆరడుగుల భౌతిక దూరం ఎక్కడ..?
విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు 6 అడుగుల భౌతిక దూరం పాటించని విద్యుత్‌ వినియోగదారులు

కనీస జాగ్రత్తలు పాటించని విద్యుత్‌ వినియోగదారులు

అనకాపల్లి, మే 18:
అనకాపల్లి ఏపీ ఈపీడీసీఎల్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కేంద్రంలో వినియోగదారులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం లేదు. మీ సేవా కేంద్రాలు, ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా బిల్లుల చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలా మంది ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయానికే వచ్చి బిల్లులు చెల్లిస్తున్నారు. క్యూలో ఒకరి వెనుక మరొకరు దగ్గరగా ఉంటున్నారు. విద్యుత్‌ సిబ్బంది కూడా వారికి కనీస సూచనలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ దృశ్యాలు చూస్తున్న వారు ఇలాగైతే కరోనా రాదా! మరి అని చర్చించుకోవడం విశేషం.

Updated Date - 2021-05-19T04:51:28+05:30 IST