అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

ABN , First Publish Date - 2021-11-06T04:35:53+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ 

పరవాడ, నవంబరు 5: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు. వెన్నెలపాలెం ఏసీ కల్యాణ మండపంలో శుక్రవారం మండల అఽధికారులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, సచివాలయం ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించి సంబంధిత సర్పంచ్‌ల ద్వారా సమస్యల గురించి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు తమవంతు కృషి చేయాలన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంపైనే దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పైలా వెంకటపద్మలక్ష్మి శ్రీనివాస్‌, జడ్పీటీసీ పైలా సన్యాసిరాజు, వైస్‌ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, తహసీల్దార్‌ బీవీ రాణి, ఎంపీడీవో  వి.హేమసుంధరరావు, ఎంఈవో ఎం.సునీత, మండల ఇంజనీర్‌ గండి రామారావు, ఐసీడీఎస్‌ సీడీపీవో కేఎల్‌ఆర్‌కే కుమారి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-06T04:35:53+05:30 IST