ఎరకన్నపాలెం నీటి కష్టాలు ఎవరికెరుక!

ABN , First Publish Date - 2021-12-25T06:31:10+05:30 IST

మండలంలోని ఎరకన్నపాలెం గ్రామ స్థులను తాగునీటి సమస్య వేధిస్తోంది. రాచపల్లి శివారున ఉన్న ఈ గ్రామంలో నెలరోజుల క్రితం నీటి పథకం మోటారు పాడైంది. దీంతో కుళాయిల నుంచి నీరురాని పరిస్థితి నెలకొంది.

ఎరకన్నపాలెం నీటి కష్టాలు ఎవరికెరుక!
బిందెడు నీటి కోసం చేతి బోరు వద్ద మహిళల నిరీక్షణ

  నీటి పథకం మోటారు పాడవ్వడంతో నెల రోజులుగా సమస్య

 ఉన్న ఒక్క చేతి బోరే ఆధారం కావడంతో గంటల తరబడి నిరీక్షణ

మాకవరపాలెం, డిసెంబరు 24 : మండలంలోని ఎరకన్నపాలెం గ్రామ స్థులను తాగునీటి సమస్య వేధిస్తోంది. రాచపల్లి శివారున ఉన్న ఈ గ్రామంలో నెలరోజుల క్రితం నీటి పథకం మోటారు పాడైంది. దీంతో కుళాయిల నుంచి నీరురాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా గ్రామంలో ఉన్న ఒక్క చేతి బోరే వీరికి ఆధారంగా మారింది.  వేకు జాము నుంచి నిరీక్షిస్తే తప్ప, బిందెడు నీరు దొరకడం లేదని మహిళలు వాపో తున్నారు. గతంలో ఈ చేతి బోరు నీరు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వం టివి వచ్చేవని,  అధికా రుల దృష్టికి వెళ్ల డంతో ఈ నీటిని తాగవద్దని చెప్పినట్టు గ్రామస్థులు తెలిపారు.  గత్యంతరం లేక ఈ నీటినే తాగుతున్నామన్నారు.

Updated Date - 2021-12-25T06:31:10+05:30 IST