అనుమానాస్పదంగా వాచ్‌మన్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-19T04:44:26+05:30 IST

జీవీఎంసీ ఎనిమిదో వార్డు పరిధిలోని సన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి గొల్లల ఎండాడకు వెళ్లే మార్గంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు.

అనుమానాస్పదంగా వాచ్‌మన్‌ మృతి

ఎండాడ, మే 18: జీవీఎంసీ ఎనిమిదో వార్డు పరిధిలోని సన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి గొల్లల ఎండాడకు వెళ్లే మార్గంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఆరిలోవ ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా కోరుకొండ సమీపంలోని అట్టాడ గ్రామానికి చెందిన మంగా రామకృష్ణ (40) భార్య, కుమారుడితో కలిసి ఇక్కడి సహస్ర అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం రామకృష్ణ సమీపంలో ఉంటున్న తన అక్క వెంకటలక్ష్మి వాళ్లింటికి వెళతానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులతో కలిసి వెతికారు. రామకృష్ణకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో ఎక్కడో ఉంటాడనుకున్నారు. కాగా మంగళవారం ఉదయం అపార్ట్‌మెంటు వెనుకనున్న పొదల్లో రామకృష్ణ మృతదేహం ఉండడాన్ని స్థానికులు చూసి గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహం నల్లగా మారి ఉండడంతో పాటు నోటి నుంచి రక్తం కక్కుకుని ఉన్నందున పాము కాటేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-19T04:44:26+05:30 IST