బీచ్‌కు తగ్గిన సందర్శకుల తాకిడి

ABN , First Publish Date - 2021-05-03T03:59:53+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో ఆర్కే బీచ్‌కు సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. ప్రతీ ఆదివారం సాయంత్రం వేళ బీచ్‌లో సందర్శకులు కిక్కిరిసిపోయి ఉంటారు

బీచ్‌కు తగ్గిన సందర్శకుల తాకిడి
బీచ్‌లో అంతంతమాత్రంగానే ఉన్న సందర్శకులు

విశాఖపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి నేపథ్యంలో ఆర్కే బీచ్‌కు సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. ప్రతీ ఆదివారం సాయంత్రం వేళ బీచ్‌లో సందర్శకులు కిక్కిరిసిపోయి ఉంటారు. అయితే కరోనా ఉధృతి కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. దీని ప్రభావం బీచ్‌కు సందర్శకుల తాకిడిపై పడింది. ఆదివారం సాయంత్రం బీచ్‌ నిర్మానుష్యంగా మారింది. వచ్చిన కొద్దిమందిని కూడా పోలీసులు కరోనా తీవ్రత దృష్ట్యా బయట తిరగడం ప్రమాదకరమంటూ అవగాహన కల్పించడంతో చాలామంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.


Updated Date - 2021-05-03T03:59:53+05:30 IST