ఘనంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం

ABN , First Publish Date - 2021-03-22T05:54:36+05:30 IST

వర్షాలు చక్కగా కురవాలన్నా, పంటలు బాగా పండాలన్నా, స్వచ్ఛమైన గాలి మనుషులకు కావాలన్నా అడవులను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని వీఎస్‌ఈజడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి అన్నారు.

ఘనంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం
వీఎస్‌ఈజడ్‌లో మొక్కలు నాటుతున్న డీసీ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి

కూర్మన్నపాలెం, మార్చి 21: వర్షాలు చక్కగా కురవాలన్నా, పంటలు బాగా పండాలన్నా, స్వచ్ఛమైన గాలి మనుషులకు కావాలన్నా అడవులను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని వీఎస్‌ఈజడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. దువ్వాడ వీఎస్‌ఈజడ్‌లో ఆదివారం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీఎస్‌ఈజడ్‌ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి తరాలు వారికి అడవుల ప్రాధాన్యతను తెలపాలని సూచించారు. కాలుష్య నివారణకు చెట్లు నాటాలని పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో డీడీసి ఫణి,  ఏడీసీ  ప్రసన్న, శ్రీనివాసరాజు, ఫ్రియాంక, శంకర్‌ వివిధ పరిశ్రమల ప్రతినిథులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-22T05:54:36+05:30 IST