నెల్లూరు జేసీగా వీఎంఆర్‌డీఏ సెక్రటరీ గణేష్‌కుమార్
ABN , First Publish Date - 2021-05-13T05:07:40+05:30 IST
నెల్లూరు జేసీగా వీఎంఆర్‌డీఏ సెక్రటరీ గణేష్‌కుమార్
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సెక్రటరీ గణేష్‌కుమార్‌ను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)గా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన గత ఏడాది కరోనా సమయంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. గణేశ్‌కుమార్‌కు ఇటీవలె ఐఏఎస్ హోదా వచ్చింది. దాంతో జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. వీఎంఆర్‌డీఏలో అడిషనల్ కమిషనర్‌ను ప్రభుత్వం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పంపేసింది. ఇప్పుడు గణేశ్‌కుమార్‌ను నెల్లూరు జిల్లాకు బదిలీ చేసింది.