రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ టోర్నీకి విశాఖ జట్టు

ABN , First Publish Date - 2021-12-08T06:00:24+05:30 IST

రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌ మీట్‌లో పాల్గొనే విశాఖ అథ్లెట్ల ఎంపిక పోటీలు మంగళవారం పోర్టు గోల్డెన్‌ జూబ్లీ స్టేడియంలో నిర్వహించారు. అండర్‌-16, 18, 20 సీనియర్‌ కేటగిరీలలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది అథ్లెట్లు పాల్గొనగా, 15 మంది తుది జట్టుకు ఎంపికయ్యారు.

రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ టోర్నీకి విశాఖ జట్టు
జిల్లా జట్టుకు ఎంపికైన అథ్లెట్లతో క్రీడా సంఘం ప్రతినిధులు

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 7: రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌ మీట్‌లో పాల్గొనే విశాఖ అథ్లెట్ల ఎంపిక పోటీలు మంగళవారం పోర్టు గోల్డెన్‌ జూబ్లీ స్టేడియంలో నిర్వహించారు. అండర్‌-16, 18, 20 సీనియర్‌ కేటగిరీలలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది అథ్లెట్లు పాల్గొనగా, 15 మంది తుది జట్టుకు ఎంపికయ్యారు. పురుషుల కేటగిరీలో ముబార్షిర్‌ ఖాన్‌, ఎస్‌.శ్రీధర్‌, కె.దుర్గాప్రసాద్‌, పి.సత్యనారాయణ, వి.చైతన్య, వై.కిరణ్‌, మహిళల విభాగంలో వి.రామలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, బి.రమ, కె.రమ్య, వై.నవ్య, ఎం.ఆశా, అండర్‌-20 బాలుర కేటగిరీలో జి.లక్ష్మణ, సీహెచ్‌.సురేశ్‌, వై.శ్యాంకుమార్‌ ఎంపికయ్యారు. ఈ జట్టు ఈనెల 24 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ మీట్‌లో పాల్గొంటుందని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.నారాయణరావు తెలిపారు. 


Updated Date - 2021-12-08T06:00:24+05:30 IST