కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పల్లా శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-05-02T19:29:23+05:30 IST

కోవిడ్ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశాఖ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పల్లా శ్రీనివాస్ అన్నారు.

కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పల్లా శ్రీనివాస్

విశాఖపట్నం: కోవిడ్ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశాఖ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ భవనాల రంగులకు, సలహాదారుల జీతాలకు వేలకోట్లు ఖర్చుచేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చే నిధులను వ్యాక్సినేషన్ కోసం కాకుండా ఇతరత్రా ఖర్చులు చేశారని ఆరోపించారు. కేంద్ర నిధులు ఏ మేరకు ఉపయోగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.1600 కోట్లు వ్యాక్సిన్ కోసం కేటాయించాలన్నారు. ఆక్సిజన్ మేనేజ్ మెంట్ కష్టతరంగా మారిందని...ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. టెన్త్ ,ఇంటర్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలన్నారు. 35 లక్షల మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు ముప్పు ఉందని పల్లా శ్రీనివాస్ తెలిపారు. 

Updated Date - 2021-05-02T19:29:23+05:30 IST