విశాఖలో కొనసాగుతున్న టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లు

ABN , First Publish Date - 2021-10-20T16:26:27+05:30 IST

నగరంలో టీడీపీ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్‌లో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుప్రణవ్ గోపాల్,

విశాఖలో కొనసాగుతున్న టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లు

విశాఖపట్నం: నగరంలో టీడీపీ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్‌లో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుప్రణవ్ గోపాల్,  రాష్ట్రకార్యదర్శి ఆరేటి మహేష్,పోతన రెడ్డి, పుచ్చావిజయ్కుమార్, పలువురు టీడీపి నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. శాంతియుతంగా బంద్  నిర్వహిద్దామంటే..నిన్న అర్ధరాత్రి నుంచి తమను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. దాడులు జరుగుతుంటే..పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌కు లేదన్నారు.  ‘‘గుడివాడ అమర్.. నోరు అదుపులో పెట్టుకుని, నీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని’’ అన్నారు. డ్రగ్స్‌పై బహిరంగ చర్చకు టీఎన్ఎస్ఎఫ్ సిద్ధంగా ఉందని...వైసీపీ నేతలు సిద్ధమా? అంటూ ప్రణవ్ గోపాల్ సవాల్ విసిరారు. 

Updated Date - 2021-10-20T16:26:27+05:30 IST