దిశ చట్టం...ఒక డొల్ల చట్టం: Pranav

ABN , First Publish Date - 2021-09-03T18:07:04+05:30 IST

దిశ చట్టం...ఒక డొల్ల చట్టమని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వ్యాఖ్యానించారు.

దిశ చట్టం...ఒక డొల్ల చట్టం: Pranav

విశాఖపట్నం: దిశ చట్టం...ఒక డొల్ల చట్టమని  టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేదని..జగన్ ఫేక్ సీఎం.. చేతకాని ముఖ్యమంత్రి అని విమర్శించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత..550 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు.  21 రోజుల్లో ఉరి శిక్ష అన్నారు ఏమైందని ప్రశ్నించారు. తమ ఇంటిలో అక్కా చెల్లెళ్లకు రక్షణ ఇవ్వలేదని...రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏమి రక్షణ ఇస్తారని నిలదీశారు.  అక్రమ అరెస్టులకు టీఎన్‌ఎస్‌ఎఫ్ భయపడదని...మహిళలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మహిళలకు అన్యాయం జరుగుతుంటే...హోంమంత్రి, మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఎందుకు మాట్లాడరని ప్రణవ్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-03T18:07:04+05:30 IST