విశాఖలో ప్రజా సంఘాలు, వామపక్షాల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-07-08T17:48:27+05:30 IST
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు గురువారం రాస్తారోకో నిర్వహించాయి.

విశాఖపట్నం: విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు గురువారం రాస్తారోకో నిర్వహించాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పార్లమెంటు ఎంపీలు పోరాడాలని అన్నారు. ఈ నెల 10న స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా నిరసన ప్రదర్శనకు అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.