విశాఖ ఏవోబీలో రెండు నాటు పడవలు బోల్తా.. ఏడుగురి గల్లంతు
ABN , First Publish Date - 2021-05-25T13:20:56+05:30 IST
విశాఖ ఏవోబీలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి ఏడుగురు కూలీలు గల్లంతయ్యారు.
విశాఖపట్నం: విశాఖ ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి ఏడుగురు కూలీలు గల్లంతయ్యారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాద్ కూలి పనులకు వెళ్ళి లాక్డౌన్ వల్ల తిరిగి స్వగ్రామలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన కూలీలది గుంటవాడ, కెందుగుడా గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మల్కాన్ గిరి జిల్లా కెందుగుడ వద్ద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.