సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న స్వరూపా నందేంద్ర స్వామి

ABN , First Publish Date - 2021-11-05T18:03:26+05:30 IST

స్వరూపా నందేంద్ర స్వామి శుక్రవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న స్వరూపా నందేంద్ర స్వామి

విశాఖపట్నం: శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి శుక్రవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామిజీల చేతుల మీదుగా దేవాలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన నక్షత్ర వనం, శివాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్తీక మాస ప్రారంభోత్సవం సందర్భంగా త్రిపురాంతక స్వామి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్బంగా స్వరూపా నందేంద్ర స్వామి మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న స్వామి దర్శనాన్ని చేసుకోవడం, నక్షత్ర వనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ సంతోషంగా వుండాలని స్వామిని కోరుకున్నానన్నారు. 2013 కేధారినాథ్ హిమాలయ ప్రాంతం వరదలతో చాలా నష్టం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ హరిద్వార్ దగ్గర నుంచి గంగోత్రి, యమునోత్రి వరకు రోడ్లు నిర్మించారని కొనియాడారు. 

Updated Date - 2021-11-05T18:03:26+05:30 IST