రోబోటిక్‌ యంత్రంతో జీవీఎంసీ మ్యాన్‌హోల్స్‌ క్లీనింగ్‌

ABN , First Publish Date - 2021-03-25T05:24:10+05:30 IST

మ్యాన్‌ హోల్స్‌లో చెత్తను తొలగించే రోబోటిక్‌ యంత్రాన్ని 44వ వార్డు షాదీకాన కళ్యాణ మండపంలో బుధవారం నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ప్రారంభించారు.

రోబోటిక్‌ యంత్రంతో జీవీఎంసీ మ్యాన్‌హోల్స్‌ క్లీనింగ్‌
యంత్రాన్ని ప్రారంభిస్తున్న విశాఖ మేయర్‌ హరివెంకటకుమారి

ఓఎన్‌జీసీ అందించిన మిషన్‌ని ప్రారంభించిన విశాఖ మేయర్‌ హరివెంకటకుమారి

అక్కయ్యపాలెం, మార్చి 24: మ్యాన్‌ హోల్స్‌లో చెత్తను తొలగించే రోబోటిక్‌ యంత్రాన్ని 44వ వార్డు షాదీకాన కళ్యాణ మండపంలో బుధవారం నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోబోటిక్‌ మిషన్ల ద్వారా డ్రైనేజీలనుంచి సులభంగా చెత్తను తొలగించి శుభ్రం చేయవచ్చునని తెలిపారు. రూ.45 లక్షలు విలువచేసే ఈ మిషన్‌ను ఓఎన్‌జీసీ వారు జీవీఎంసీకి ఉచితం గా అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.


కార్యక్రమంలో ఉత్తరం వైసీపీ కన్వీనర్‌ కె.కె. రాజు, వార్డు కార్పొరేటర్‌ బానాల శ్రీనివాస రావు, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ సన్యాసిరావు, ఎస్‌ఈ వేణుగోపాల్‌, ఓన్‌జీసీ జీఎం ఎ.కె.గోయల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-25T05:24:10+05:30 IST