విశాఖ... ’2505’
ABN , First Publish Date - 2021-05-09T05:02:46+05:30 IST
జిల్లాలో కొవిడ్ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. గత నెలాఖరు నాలుగో వారం నుంచి ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
చికిత్స పొందుతూ మరో 13 మంది మృత్యువాత
విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. గత నెలాఖరు నాలుగో వారం నుంచి ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నెల ఐదో తేదీన రికార్డు స్థాయిలో 2,293 వచ్చాయి. శనివారం అంతకుమించి...2,505 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 96,125కు చేరుకుంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా చూస్తే విశాఖ జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
12 మంది మృతి: జిల్లాలో అత్యధిక మరణాలు శనివారమే సంభవించాయి. వివిధ ఆస్పత్రుల్లో 12 మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో కొవిడ్ మరణాల సంఖ్య 688కు చేరింది.
1185 మంది డిశ్చార్జి: చికిత్స పొంది 1,185 మంది కోలుకున్నారు. వీరిలో మొత్తం రికవరీల సంఖ్య 77,580కు చేరింది. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉండడం కొంత ఉపశమనం కలిగించే అంశంగా వైద్యులు పేర్కొంటున్నారు.