విప్లవ జ్యోతి మర్రి కామయ్య
ABN , First Publish Date - 2021-05-06T04:27:06+05:30 IST
గిరిజన శేయస్సు కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవజ్యోతి మర్రి కామయ్య అని వక్తలు పేర్కొన్నారు. ఆయన వర్ధంతిని బుధవారం మండలంలోని డౌనూరు శివారు తులబాడలో యువజన సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

కొయ్యూరు, మే 5: గిరిజన శేయస్సు కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవజ్యోతి మర్రి కామయ్య అని వక్తలు పేర్కొన్నారు. ఆయన వర్ధంతిని బుధవారం మండలంలోని డౌనూరు శివారు తులబాడలో యువజన సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మన్యంలో ముఠాదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు కిల్లో శంకర్, పాంగి సత్తిబాబు, తుబాడ ప్రసాద్, తాంబేలు చిట్టిబాబు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు, మే 5: స్వాతంత్య్ర సమరయోధుడు మర్రి కామయ్య 40వ వర్థంతిని గిరిజన విద్యార్థి సంఘ భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జీఎస్యూ అధ్యక్షుడు బి.సుమన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నేతలు, జేఏసీ ప్రతినిధులు మర్రి కామయ్య చిత్రా పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.