అప్పన్న సన్నిధిలో వేదాశీర్వచనాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-02T06:45:14+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో ఆర్జిత సేవగా సోమవారం నుంచి వేదాశీర్వచనాలు ప్రారంభమయ్యాయి.

అప్పన్న సన్నిధిలో వేదాశీర్వచనాలు ప్రారంభం
ఆశీర్వచనాలందిస్తున్న వేదపండితులు

సింహాచలం, నవంబరు 1: సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో ఆర్జిత సేవగా సోమవారం నుంచి వేదాశీర్వచనాలు ప్రారంభమయ్యాయి. అనేక మంది భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం పాలక మండలి, అధికారులు వేదాశీర్వచనాలను ప్రారంభించడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆధ్వర్యంలో సోమవారం వేదాశీర్వచనాల సేవను పురోహితుడు కరి సీతారామాచార్యులు పర్యవేక్షణలో ప్రారంభించారు. తొలిరోజు 25 కుటుంబాలకు చెందిన భక్తులు పండితుల వేదాశీర్వచనాలు పొందారు. ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు రెండేసిన చొప్పున ఎనభై గ్రాముల లడ్డూ ప్రసాదాలను ఏఈవో కేకే రాఘవకుమార్‌ అందజేశారు.


Updated Date - 2021-11-02T06:45:14+05:30 IST