రీజనల్‌ స్కిల్‌ కాంపిటేషన్‌ ఏర్పాట్లపై వీసీ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-30T05:02:30+05:30 IST

రీజనల్‌ స్కిల్‌ కాంపిటేషన్‌ నిర్వహణ, ఏర్పాట్లపై ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి శుక్రవారం వర్సిటీ పాలకమండలి సమావేశ మందిరంలో ఎన్‌ఎస్‌డీసీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులతో కలిసి సమీక్షించారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు విశాఖ వేదికగా రీజినల్‌ స్కిల్‌ కాంపిటేషన్‌ నిర్వహిస్తున్నారు.

రీజనల్‌ స్కిల్‌ కాంపిటేషన్‌ ఏర్పాట్లపై వీసీ సమీక్ష
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ క్యాంపస్‌, అక్టోబరు 29: రీజనల్‌ స్కిల్‌ కాంపిటేషన్‌ నిర్వహణ, ఏర్పాట్లపై ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి శుక్రవారం వర్సిటీ పాలకమండలి సమావేశ మందిరంలో ఎన్‌ఎస్‌డీసీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులతో కలిసి సమీక్షించారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు విశాఖ వేదికగా రీజినల్‌ స్కిల్‌ కాంపిటేషన్‌ నిర్వహిస్తున్నారు. 51 ట్రేడ్స్‌లో జరిగే పోటీలకు వేదికల ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. అత్యధిక పోటీ లను ఏయూ వేదికగా నిర్వహించాలని వీసీ సూచించారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలోని కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌, సివిల్‌ విభాగాల్లో వాటికి అనుగుణంగా ఉండే పోటీలను నిర్వహించాలన్నారు. సమావేశంలో అధికారులు బంగార్రాజు, కృష్ణమోహన్‌, జేమ్స్‌ స్టీఫెన్‌, రామకోటిరెడ్డి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:02:30+05:30 IST