పర్యాటకుల మదిని దోచే వంజంగి మంచు కొండలు
ABN , First Publish Date - 2021-10-05T06:10:23+05:30 IST
మన్యంలోని మంచు అందాలు పర్యాటకులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. మండలంలోని వంజంగి లోని మంచుకొండలను తిలకించేందుకు సోమవారం సందర్శకులు వందలాది మంది తరలివచ్చారు.
పాడేరు రూరల్, అక్టోబరు 4: మన్యంలోని మంచు అందాలు పర్యాటకులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. మండలంలోని వంజంగి లోని మంచుకొండలను తిలకించేందుకు సోమవారం సందర్శకులు వందలాది మంది తరలివచ్చారు. పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లను వంజంగి యువకులు చేస్తున్నారు. పర్యాటకులు అక్కడ రాత్రి బస చేసేందుకు అవసరమైన గుడారాలు, ఫైర్ క్యాంఫియన్‌లకు కట్టెలు వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. మంచు కొండల్లో సందర్శకుల మనసు దోచేందుకు ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు వాతావరణం అనుకూలిస్తున్నది. పర్యాటకులు ముందు రోజు రాత్రే అక్కడకు చేరుకోవడంతో వంజంగి మంచుకొండల్లో పర్యాటకుల రాత్రి బసలు పెరిగాయి.