మలివిడత కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-06T07:10:31+05:30 IST
ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో మలివిడత కొవిడ్ టీకా ప్రక్రియ ప్రారంభమైంది.

నర్సీపట్నం/మాకవరపాలెం, ఫిబ్రవరి 5 : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో మలివిడత కొవిడ్ టీకా ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత వైద్య ఆరోగ్య సిబ్బందికి, వైద్యులకు వ్యాక్సిన్ వేసిన సంగతి తెలిసిందే. రెండో విడత పోలీస్, మునిసిపల్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. శుక్రవారం మునిసిపల్ కమిషనర్ కనకారావుతో పాటు పలువురు మునిసిపల్ సిబ్బందికి టీకాలు వేయించుకున్నారు. ఇదిలావుంటే, మండల కేంద్రమైన మాకవరపాలెం పీహెచ్‌సీలో మండల పరిషత్, తహసీల్దార్, మండల విద్యా శాఖాధికారి కార్యాలయాల ఉద్యోగులు 120 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య తెలిపారు.