ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి
ABN , First Publish Date - 2021-11-26T06:22:14+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ శ్రీనివాసరావు సూచించారు.

మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు
రోలుగుంట, నవంబరు 25: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ శ్రీనివాసరావు సూచించారు. రోలుగుంట రైతుభరోసా కేంద్రం వద్ద గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్‌లో రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి విజయలక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకట్రావు, సీఈవో మడ్డు మహేశ్, ఎంపీఈవో వాణి పాల్గొన్నారు.
బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట పీఏసీఎస్ ద్వారా 500 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పీఏసీఎస్ చైర్‌పర్సన్ సుంకర శ్రీను తెలిపారు. గురువారం పీఏసీఎస్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద కిలోల ఎ-గ్రేడ్ ధాన్యానికి రూ.1960, బి-గ్రేడ్‌కు రూ.1940 చొప్పున ధర చెల్లించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవర తాతబాబు, కొల్లిమళ్ల మాణిక్యం, పీఏసీఎస్ సీఈవో పిన్నంరెడ్డి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.