యాప్‌ల భారాన్ని తగ్గించాలని యూటీఎఫ్‌ నిరసన

ABN , First Publish Date - 2021-10-07T06:14:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సమయానికి ఆటంకం కలిగిస్తూ రోజురోజుకూ పెరిగిపోతున్న యాప్‌ల భారాన్ని తగ్గించాలని కోరుతూ పారిశ్రామిక ప్రాంత ఉపాధ్యాయులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

యాప్‌ల భారాన్ని తగ్గించాలని యూటీఎఫ్‌ నిరసన
గాజువాక హైస్కూల్‌ ఆవరణలో నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు

గాజువాక, అక్టోబరు 6 : ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సమయానికి ఆటంకం కలిగిస్తూ రోజురోజుకూ పెరిగిపోతున్న యాప్‌ల భారాన్ని తగ్గించాలని కోరుతూ పారిశ్రామిక ప్రాంత ఉపాధ్యాయులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజువాక, మింది, అక్కిరెడ్డిపాలెం, కణితి జిల్లా పరిషత్‌ పాఠశాలలతోపాటు 42 ప్రాథమిక పాఠశాలల్లో  ఉపాధ్యాయులు, సిబ్బంది తమ పాఠశాలల ఆవరణలో నిరసన తెలిపారు. యూటీఎఫ్‌  నాయకులు తాడాన అప్పారావు,  వత్సవాయి శ్రీలక్ష్మి, టీఎస్‌ చలం, బి.త్రిలోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-07T06:14:08+05:30 IST