గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-12-08T04:59:54+05:30 IST

మండలంలోని రామవరం జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్టు ఆనందపురం సీఐ వై.రవి మంగళవారం తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మృతదేహం

ఆనందపురం, డిసెంబరు 7: మండలంలోని రామవరం జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్టు ఆనందపురం సీఐ వై.రవి మంగళవారం తెలిపారు. రామవరం హైవేపై గుర్తు తెలియని వాహనం రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడి వయసు పాతికేళ్లు వుంటాయని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.


Updated Date - 2021-12-08T04:59:54+05:30 IST