డివైడర్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2021-05-03T04:41:24+05:30 IST

మండలంలోని పి.ఎల్‌.పురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

డివైడర్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
ఘటనా స్థలంలో పడివున్న యుకుడు


పాయకరావుపేట రూరల్‌, మే 2 : మండలంలోని పి.ఎల్‌.పురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్‌.ఐ డి.ధీనబంధు కథ నం ప్రకారం వివరాలివి. ఒడిశాకు చెందిన దిష్‌వాల్‌ గౌతమ్‌(23), జితేంద్రసాహుల్‌(20) మహారాష్ట్ర నుంచి ఒడిశాకు స్కూటీపై వెళుతున్నారు. పి.ఎల్‌.పురం జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్‌లో తుని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయినట్టు ఎస్‌ఐ చెప్పారు. 


Updated Date - 2021-05-03T04:41:24+05:30 IST