రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-03-22T05:47:59+05:30 IST

ఆటోను వెనుక నుంచి బొలేరో వాహనం ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని అర్జాపు రం వద్ద ఆదివారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

రావికమతం, మార్చి 21: ఆటోను వెనుక నుంచి బొలేరో వాహనం ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని అర్జాపు రం వద్ద ఆదివారం జరిగింది. మాడుగుల మండలం కేజే పురానికి చెందిన ఆరుగురు ఆటోలో తలుపులమ్మలోవకు ఆదివారం ఉదయం వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో రావికమతం మండలం అర్జాపురం వద్దకు వచ్చేస రికి వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీ కొట్టి పరారయింది. దీంతో ఆటోలో ఉన్న పి.సత్యనారాయణ, డి.రామకృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2021-03-22T05:47:59+05:30 IST