గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-03-21T06:01:15+05:30 IST

గంజాయి కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపారు.

గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు

అనకాపల్లి టౌన్‌, మార్చి 20: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపారు. జాతీయ రహదారిలోని జలగలమదుం జంక్షన్‌ సమీపంలో జనవరి 28న కారులో 274 కిలోల గంజాయి పట్టుబడిందని చెప్పారు. పోలీసులను చూసి ఆ రోజు పరారైన రోలుగుంట మండలం బెన్నభూపాలపట్నంకు చెందిన డి.నాగశేషు (23), బలిజిపాలేనికి చెందిన కరణం నాగేశ్వరరావు (26) శనివారం తుమ్మపాల సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-03-21T06:01:15+05:30 IST