నాడు-నేడు పనులు టీడబ్ల్యూ ఈఈ తనిఖీలు
ABN , First Publish Date - 2021-01-20T06:03:14+05:30 IST
మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనులపై మంగళవారం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేవీఎస్ కుమార్ తనిఖీలు నిర్వహించారు.

కొయ్యూరు, జనవరి 19: మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనులపై మంగళవారం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేవీఎస్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. శరభన్నపాలెంలో రూ.రెండు కోట్లతో జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతుండడంపై ఈఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంప ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అదనపు భవన నిర్మాణాలు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈఈ కుమార్ మాట్లాడుతూ నాడు-నేడు పనులు గడువులోపు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా చేయాలన్నారు. ఆయన వెంట డీఈఈ డీవీఎస్‌ఎన్ రాజు, జేఈ సుబ్బారావు ఉన్నారు.