రాజ్యాంక నిర్మాతకు నివాళి

ABN , First Publish Date - 2021-12-07T05:59:40+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, దళిత, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

రాజ్యాంక నిర్మాతకు నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, దళిత, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎల్‌ఐసీ జంక్షన్‌లో గల అంబేడ్కర్‌ విగ్రహానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్‌ హరికుమారి, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా పూలమాలలు వేశారు. టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఓటీఎస్‌ పేరుతో పేదలపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతోందంటూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

 

తీరంలో యుద్ధనౌకల సందడి

యుద్ధనౌకలు తీరం వెంబడి వెళుతూ నగర ప్రజలకు సోమవారం కనువిందు చేశాయి. ఈ నెల 4న నౌకా దళ దినోత్సవం సందర్భంగా తూర్పు నౌకాదళంలో పనిచేస్తున్న యుద్ధనౌకలన్నీ డాక్‌యార్డుకు చేరుకున్నాయి. తుఫాన్‌ కారణంగా వాటి సందర్శనకు ప్రజలను ఆహ్వానించలేకపోయారు. పరిస్థితి కొంత మెరుగు కావడంతో ఆదివారం రాత్రి పలు నౌకలకు విద్యుద్దీపాలు అలంకరించి ప్రదర్శించారు. సోమవారం అవన్నీ తిరిగి డాక్‌యార్డుకు వెళుతూ కనిపించాయి. మరికొన్ని విధుల్లో భాగంగా పహారాకు బయలుదేరి వెళ్లాయి.



Updated Date - 2021-12-07T05:59:40+05:30 IST