కొయ్యూరు ఎంపీపీ రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2021-10-14T06:11:02+05:30 IST

కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేశ్‌ గిరిజనుడు కాదని, ఎస్టీలకు రిజర్వు చేసిన ఈ పదవిలో ఉండడానికి అతను అర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.సింహాద్రి, కార్యదర్శి ఎస్‌.సింహాచలం డిమాండ్‌ చేశారు.

కొయ్యూరు ఎంపీపీ రాజీనామా చేయాలి
పాడేరులో సమావేశమైన గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు

గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్‌ 

బడుగు రమేశ్‌ గిరిజనేతరుడని ఆరోపణ


పాడేరు, అక్టోబరు 13: కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేశ్‌ గిరిజనుడు కాదని, ఎస్టీలకు రిజర్వు చేసిన ఈ పదవిలో ఉండడానికి అతను అర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.సింహాద్రి, కార్యదర్శి ఎస్‌.సింహాచలం డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బడుగు రమేశ్‌ తండ్రి గిరిజనేతరుడు కాగా, తల్లి ఎస్‌టీ అని, గిరిజనేతరుడికి పుట్టిన వారు చట్టప్రకారం ఎస్‌టీలు కారని స్పష్టం చేశారు. సమావేశంలో గిరిజన ఉద్యోగుల సంఘ నేతలు నందో, జాన్‌బాబు, శేషాద్రి, సన్యాసిరావు, నాగరాజు, దామోదరం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


బోగస్‌ గిరిజనులకు ఎమ్మెల్యే అండ

కొయ్యూరు, అక్టోబరు 13: ఆదివాసీల హక్కులు, చట్టాలను కాలరాస్తున్న బోగస్‌ గిరిజనులకు పాడేరు ఎమ్మెల్యే భ్యాగ్యలక్ష్మి అండగా నిలుస్తున్నారని ఆదివాసీ జేఏసీ నేతలు ఆరోపించారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, బోగస్‌ ఎస్టీ కులధ్రువీకరణ పత్రంతో ఎంపీపీ అయిన బడుగు రమేశ్‌కు ఆమె మద్దతు పలకడం గిరిజనులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి భగత, వాల్మీకి కులాలను తొలగించినా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పట్టించుకోలేదని, గిరిజనేతరుల బాగోగులే ప్రధానంగా భావిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొట్టడం రాజబాబు, జిల్లా కన్వీనర్‌ రామారావు దొర, సలహాదారు గంగరాజు, కొయ్యూరు జేఏసీ కన్వీనర్‌ మాకాడ బూర్గులయ్య, కోకన్వీనర్‌ జి.లక్ష్మణ్‌, జేఏసీ మహిళా ప్రతినిధి శ్యామల వరలక్ష్మి, తదితరలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-14T06:11:02+05:30 IST