పోలీసుల అదుపులో గిరిజన సంఘం నేతలు

ABN , First Publish Date - 2021-12-30T05:37:51+05:30 IST

పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి హాజరయ్యే అధికారులను అడ్డుకుని, ఆందోళన చేస్తారన్న ముందస్తు సమాచారంతో స్థానిక పోలీసులు బుధవారం తెల్లవారుజామున గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నర్సయ్య, ఎం.ఎం.శ్రీనులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల అదుపులో గిరిజన సంఘం నేతలు
నర్సయను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఐటీడీఏ సమావేశాన్ని అడ్డుకుంటారేమోనని ముందస్తు చర్యలు


ముంచంగిపుట్టు, డిసెంబరు 29: పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి హాజరయ్యే అధికారులను అడ్డుకుని, ఆందోళన చేస్తారన్న ముందస్తు సమాచారంతో స్థానిక పోలీసులు బుధవారం తెల్లవారుజామున గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నర్సయ్య, ఎం.ఎం.శ్రీనులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించడం సరికాదని అన్నారు. 


అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు


పాడేరురూరల్‌, డిసెంబరు 29: ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని అడ్డుకుంటామన్న ఉద్దేశంతో ఉద్యమకారులను ముందుస్తు అరెస్టు చేయడం పోలీసులకు తగదని సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు ఎల్‌.సుందరరావు, కె.రాధాకృష్ణ అన్నారు. బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలపై పోరాడుతున్న వారి గొంతునొక్కెందుకే జగన్‌ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. తమను మంగళవారం రాత్రి అరెస్టు చేశారని, 24 గంటలపాటు నిర్బంధంలో ఉంచడం అన్యాయమన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గురువారం అన్ని మండలాల్లో రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2021-12-30T05:37:51+05:30 IST