రహదారి భద్రత అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-01-20T05:45:58+05:30 IST

రహదారి భద్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ రాజారత్నం అన్నారు.

రహదారి భద్రత అందరి బాధ్యత
రహదారి భద్రతపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న రవాణా, పోలీస్‌ శాఖ అధికారులు

డీటీసీ రాజారత్నం

విశాఖపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రహదారి భద్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ రాజారత్నం అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మద్దిలపాలెం కూడలి వద్ద రవాణా, పోలీస్‌ శాఖల అధికారులు సిబ్బందితో మంగళవారం ఆయన వాహనచోదకులు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపేవారికి గులాబి పువ్వు ఇచ్చి అభినందించారు. ఆర్‌టీఓ ఆర్‌సీహెచ్‌.శ్రీనివాస్‌, ఎంవీఐలు ఎం.మురళీకృష్ణ, హరిప్రసాద్‌, వి.వెంకటరావు, ట్రాఫిక్‌ సీఐ షన్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T05:45:58+05:30 IST