చెరువులవేనంనకు పోటెత్తిన పర్యాటకులు

ABN , First Publish Date - 2021-12-26T05:45:10+05:30 IST

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి శనివారం పర్యాటకులు పోటెత్తారు. క్రిస్మస్‌ సెలవులు కలిసి రావడంతో శనివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

చెరువులవేనంనకు పోటెత్తిన పర్యాటకులు
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు


చింతపల్లి, డిసెంబరు 25: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి శనివారం పర్యాటకులు పోటెత్తారు. క్రిస్మస్‌ సెలవులు కలిసి రావడంతో శనివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. లంబసింగి, చెరువులవేనం, తాజంగి రిజర్వాయర్‌ వద్ద ఉదయం ఐదు గంటల నుంచే పర్యాటకుల సందడి ప్రారంభమైంది. పర్యాటకులు మంచు అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల వరకు లంబసింగి పర్యాటకులతో రద్దీగా కనిపించింది.

 

Updated Date - 2021-12-26T05:45:10+05:30 IST