ప్రతీకార చర్యలను సహించం

ABN , First Publish Date - 2021-07-08T06:13:33+05:30 IST

సెయిల్‌ యాజమాన్యం ప్రతీకార చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

ప్రతీకార చర్యలను సహించం
ధర్నాలో మాట్లాడుతున్న ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల హెచ్చరిక

ఉక్కుటౌన్‌షిప్‌, జూలై 7: సెయిల్‌ యాజమాన్యం ప్రతీకార చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. సెయిల్‌ యాజమాన్యం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బుధవారం స్టీల్‌ప్లాంట్‌ టీటీఐ వద్ద ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సెయిల్‌లో 100 శాతం సమ్మెలో  పాల్గొన్నారని, దీనిని సహించని యాజమాన్యం ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నదన్నారు. యాజమాన్యాలు కార్మిక వర్గంపై దాడులు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె.అయోధ్యరామ్‌, గంధం వెంకటరావు, వైటీ దాసు, డి.ఆదినారాయణ, కొమ్మినేని శ్రీనివాసరావు, జె.సింహాచలం, కేఎస్‌ఎన్‌ రావు, వై.మస్తానప్ప, బొడ్డు పైడిరాజు, దొమ్మేటి అప్పారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T06:13:33+05:30 IST