తిమ్మాపురంలో సినిమా షూటింగ్‌ సందడి

ABN , First Publish Date - 2021-02-26T05:58:30+05:30 IST

మండలంలోని అడ్డరోడ్డు- తిమ్మాపురం ప్రాంతాల్లో సినిమా సందడి నెలకొంది.

తిమ్మాపురంలో సినిమా షూటింగ్‌ సందడి
షూటింగ్‌లో ఓ సన్నివేశం

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 25: మండలంలోని అడ్డరోడ్డు- తిమ్మాపురం ప్రాంతాల్లో సినిమా సందడి నెలకొంది. మెగాస్టార్‌ చిరంజీవి తనయ సుస్మిత నిర్మాతగా రూపొందుతున్న ఓ చిత్రంలోని సన్నివేశాలను తెరకెక్కించేందుకు యూనిట్‌ గురువారం ఇక్కడకు చేరుకుంది. పురాతమైన పెంకుటిల్లు, తోటల్లో  కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అయితే ఈ షూటింగ్‌కు సంబంధించిన ఇతర వివరాలేవీ తెలియరాలేదు.

Updated Date - 2021-02-26T05:58:30+05:30 IST