ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణతో రిజర్వేషన్‌లకు ముప్పు

ABN , First Publish Date - 2021-03-14T05:36:24+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం అన్నారు.

ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణతో రిజర్వేషన్‌లకు ముప్పు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం.

 

సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం


పాడేరురూరల్‌, మార్చి 13: ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం అన్నారు. శనివారం ఆయనిక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటు పరం చేస్తాం లేదా మూసివేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం వల్లే దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌లు అమలవుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగానే ఉందని, నేరుగా రిజర్వేషన్లను తొలగించ లేక దొడ్డిదారిని నిర్వీర్యం చేస్తున్నదన్నారు. మోదీ ప్రభుత్వం నేటి వరకు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు లాభాల బాటలో నడుస్తున్న ఎల్‌ఐసీని అమ్ముతుందన్నారు. అంబానీ, ఆదానీ వంటి పారిశ్రామికవేత్తలకు మరింత లాభాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లో సురేంద్ర, పాలికి లక్కు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-14T05:36:24+05:30 IST