ఆలోచింపజేసిన నిర్జీవ నాదం నాటిక

ABN , First Publish Date - 2021-11-28T06:24:26+05:30 IST

ఎంత గొప్ప వ్యక్తి అయినా బాధ్యతను మరిచిపోతే మనిషిగా తన ఉనికిని కోల్పోతాడన్న సందేశంతో ప్రదర్శించిన నిర్జీవ నాదం నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. రుత్తల లచ్చాపాత్రుడు, చింతకాయల వరహాలదొర స్మారక రాష్ట్ర స్థాయి ఆహ్వాన పోటీల్లో భాగంగా శనివారం రాత్రి సిటీ క్లబ్‌ ఆవరణలో ఈ నాటికను ప్రదర్శించారు.

ఆలోచింపజేసిన నిర్జీవ నాదం నాటిక
నిర్జీవనాదం నాటిక లోని ఓ సన్నివేశం

నర్సీపట్నంలో సందడిగా రాష్ట్ర స్థాయి ఆహ్వానిత నాటిక పోటీలు 

నర్సీపట్నం, నవంబరు 27: ఎంత గొప్ప వ్యక్తి అయినా బాధ్యతను మరిచిపోతే మనిషిగా తన ఉనికిని కోల్పోతాడన్న సందేశంతో ప్రదర్శించిన నిర్జీవ నాదం నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. రుత్తల లచ్చాపాత్రుడు, చింతకాయల వరహాలదొర స్మారక రాష్ట్ర స్థాయి ఆహ్వాన పోటీల్లో భాగంగా శనివారం రాత్రి  సిటీ క్లబ్‌ ఆవరణలో ఈ నాటికను ప్రదర్శించారు. డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు ఆధ్వర్యంలో రెండు రోజులుగా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శర్వాణి గ్రామీణ సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో అడపా సూరిబాబు రచన, కేకేఎల్‌ స్వామి దర్శకత్వంలో నిర్జీవ నినాదం నాటికను ప్రదర్శించారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు, ఉద్యమకారుడు, తీవ్రవాదైనప్పటికీ  ఇంటి గెలిచి... రచ్చ గెలవాలన్న ఇతివృత్తంతో ఆసక్తికరంగా మలిచారు. రావి నాగేశ్వరరావు రచన, సంధ్యా ప్రియదర్శిని దర్శకత్వంలో ప్రదర్శించిన సంకల్పం నాటికలో అంతా స్త్రీ పాత్రలే ఉండడం విశేషం. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు అప్పుల బాధలు, ఆత్మహత్యల నేపథ్యం తీసుకొని సంకల్పం కథను తీర్చిదిద్దారు. ఇందులో సూరమ్మగా సంధ్యారాణి, అన్నపూర్ణ గా జీవని, కాంతంగా శివజ్యోతి, లచ్చమ్మగా మదీన, మంత్రిగా జగదీశ్వరి ఆయా పాత్రల్లో జీవించారు.

Updated Date - 2021-11-28T06:24:26+05:30 IST